ప‌ల్ల‌కిలో ఊరేగిన సాయినాథుడు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:58 PM
 

ఒంగొలు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యములో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం   సుప్రభాత సేవ, పూజ అనంతరం సత్యసాయి వ్రతములు జరిపిన భ‌క్తులు  సాయంత్రం   పౌర్ణమి విశేష పూజల అనంతరం నూతనముగా తయారుచేయించిన పల్లకిపై స్వామివారి చిత్రపటమును నిలిపి ఒంగోలు గాంధీనగర్‌ పురవీధులలో ఊరేగించారు.  ఈ తిరువీధిలో బాలవికాస్ విద్యార్ధులు ఆల‌పించిన‌ స్వామివారి కీర్తనలను, పాటలు అంద‌రీనీ ఆక‌ట్టుకున్నాయి.  ఈ సందర్భముగా ఒంగోలు సత్యసాయి సమితి కన్వీనరు కోడెల శ్రీనివాసరావు, సత్యసాయి యువత ప్రతినిధులు వేదవ్యాస జయంతి కి నిర్వహిస్తున్న గురుపౌర్ణమి విశేషాలను భక్తులకు, విద్యార్ధులకు వివ‌రించారు. నగరోత్సవం అనంతరం హారతి, ప్రసాదవితరణ భారీగా చేసారు.