క‌డ‌ప‌లో పోలీస్ స్టేష‌న్‌పై దాడి చేసి, నిందితుడ్ని ప‌ట్టుకెళ్లిపోయారు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:42 PM
 

పోలీస్‌ స్టేషన్‌లో నిందితుని ఎస్‌ఐ విచారిస్తుండగానే అతన్ని బంధువులు స్టేష‌న్‌పై దాడి చేసి తీసుకుపోయిన ఘ‌ట‌న కడప లో జ‌రిగింది. ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న కుమ‌సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.  కడప నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హబీబుల్లా వీధికి చెందిన షేక్‌ షాబుద్దీన్‌ అనే వ్యక్తిపై అతనిభార్య సల్మాత్‌ సోదరులు గౌహర్‌ఆలీ, షేక్‌ ఖాలిద్‌ దాడి చేశారు. ఈ విష‌|య‌మై జూన్‌ 2వ తేదీన కేసు నమోదు కావ‌టంతో విచార‌ణ ఆరంభించిన పోలీసులు  ఎస్‌ఐ మంజునాథ్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం స్టేషన్‌ రైటర్, హెడ్‌ కానిస్టేబుల్‌ చాంద్‌బాషా ఆధ్వర్యంలో పోలీసు బృందం  నిందితులను అరెస్ట్‌ చేసి తీసుకొచ్చేందుకు వెళ్లింది. నిందితుల్లోఒక‌రు పారిపోగా  ఒకరైన గౌసర్‌ఆలీని స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్‌ఐ ముందు హాజరుపరిచారు.


ఎస్‌ఐ అతన్ని విచారిస్తున్న సమయంలో నిందితుని బంధువులు షేక్‌ రేష్మా, గుల్జార్‌బేగం, సల్మా, జావేద్‌ఆలీ, ముబారక్, ఆయేషా నేరుగా పోలీస్‌ స్టేషన్ కు చేరుకుని,  ఎస్ ఐని, వారిని వారించేందుకు వచ్చిన స్టేషన్‌రైటర్, కానిస్టేబుళ్లను సైతం పక్కకు తోసేసి, తమ వెంట గౌసర్‌ఆలీని లాక్కొని  వెళ్లిపోయారు. ఈ క్రమంలో రైటర్‌ చాంద్‌బాషా కి గాయమైంది.  విష‌యం తెలిసిన ఘటన స్థలానికి కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో పట్టపగలు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంపై పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ విష‌య‌మై మీడియా ప్ర‌శ్నించిన‌ప్పుడు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలోనే చిన్న సంఘటన జరిగిందని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాగా రైటర్‌ చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు పై స్టేష‌న్‌పై దాడిచేసి నిందితుడ్ని తీసుకెళ్లిన ఆరుగురితో పాటు, పై కేసులో నిందితుడైన గౌసర్‌ ఆలీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు. ఈ సంఘటన కడప నగరంలో దుమారం చెలరేగింది.