మూత పడిన దేవాలయాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:06 PM
 

చంద్రగ్రహణం కారణంగా 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూత పడింది. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. ఉదయం 11 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అన్నప్రసాద సముదాయం మూసివేసిన నేపథ్యంలో సాయంత్రం భక్తులకు 20 వేల అన్నప్రసాద ప్యాకెట్ల పంపిణీ చేయనున్నారు. మరోవైపు చంద్రగ్రహణం కారణంగా  తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం దేవాలయాలు తిరిగి తెరుచుకుంటాయి.