సీఆర్డీఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 08:49 PM
 

కృష్ణా కరకట్ట అక్రమ కట్టడాల వ్యవహారంలో చందన బ్రదర్స్‌‌కు ఇచ్చిన స్టే ఎత్తి వేయాలంటూ సీఆర్డీఏ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. చందన బ్రదర్స్ ‌యజమాని కేదారీశ్వరరావు గెస్ట్‌హౌస్ ‌కు ఇచ్చిన మూడు వారాల స్టేను నిలుపుదల చేయాలని సీఆర్డీఏ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కట్టడానికి స్టే ఇస్తే మిగిలిన కట్టడాల యజమానులంతా అదే బాట పడుతారని సీఆర్డీఏ వాదించింది. సీఆర్డీఏ యాక్టు నాలుగేళ్ల క్రితమే వచ్చిందని తాను ఆ భవనాన్ని ఇరవై ఏళ్ల క్రితమే కట్టానని కేదారీశ్వరావు అంటున్నారు. నదీ గర్బంలో రివర్ కన్జర్వేషన్ యాక్టుకు వ్యతిరేకంగా భవనాన్ని నిర్మించారని సీఆర్డీయే వాదిస్తోంది. అది అక్రమ కట్టడమైతే అనుమతులు ఎందుకిచ్చారని కేదారీశ్వర రావు తరపున వాదనలు వినిపించారు.