ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు.