ప్ర‌భుత్వానికి డ‌బ్బులొచ్చేదాక‌ టోల్ త‌ప్ప‌దు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:58 PM
 

ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని , త‌మ‌కు  మెరుగైన సేవలు కావాలంటే ప్రజలు టోల్ గేట్ల వ‌ద్ద నిబంధ‌న‌ల ప్ర‌కారం కట్టాల్సిందేనని.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మంగళవారం సభ్యులు దేశంలోని వివిధ టోల్ ప్ల‌జాల వ‌ద్ద వ‌సూళ్ల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా  లేవనెత్తిన ప‌లు అంశాల‌పై గ‌డ్క‌రీ స‌మాధాన‌మిస్తూ,  టోల్‌ ద్వారా వసూలు చేసిన నిధుల్ని గ్రామీణ, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నామని తెలిపారు.  తమ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌త ఐదేళ్ల‌లో న‌ల‌భై వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని,  దీని కార‌ణంగా ప్ర‌జా ర‌వాణ వ్య‌వ‌స్థ మెరుగు కావ‌టంతో పాటు  వ‌ర్త‌క వాణిజ్యాలు కూడా పెరిగిన విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని స‌భ్యుల‌కు సూచించారు.