ఇంగ్లండ్ టీమ్ స‌భ్యుల‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మే విందు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:18 PM
 

లండ‌న్ – 44 ఏళ్ల క‌ల‌ను సాకారం చేసి ప్రపంచ క‌ప్ ను సాధించిన ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టును అభినంద‌న‌ల‌తో ముంచేత్తారు బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మే. వరల్డ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సభ్యుల‌కు ప్ర‌ధాని విందు ఇచ్చారు.. ఈ సందర్భంగా ప్ర‌తి క్రికెట‌ర్ ను పేరు పేరున ప‌ల‌క‌రిస్తూ అభినందించారు..  వ‌ర‌ల్డ్ కప్‌లో ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని ఆమె ప్రశంసించారు. ఇయాన్‌మోర్గాన్‌ నేతృత్వంలోని జట్టు 44 ఏళ్ల ఇంగ్లండ్‌ సుధీర్ఘ కలను సాకారం చేసిందన్నారు. ఈ విజ‌యం ఇంగ్లండ్ టీమ్ కు మ‌రింత ఉత్సాహ‌న్ని ఇస్తుంద‌ని అంటూ మ‌రెన్నో విష‌యాలు సాధిస్తూ దేశానికి మ‌రింత పేరు తీసుకురావాల‌ని కెప్టెన్ మోర్గాన్ ను కోరారు