ఊరు, ఇల్లు మారడం కాదు చంద్రబాబు మారాలి: అంబటి రాంబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 03:13 PM
 

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఊరు మారడం, ఇల్లు మారడం కాదు కావాల్సింది ఆయన మారాలి అని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాద్ లో నివాసం ఉన్న చంద్రబాబు అక్కడి నుంచి ఎందుకు మకాం మార్చాల్సి వచ్చింది? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినందుకేనా? అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో ఎందుకు నివాసం ఉంటున్నారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ ను పూర్తిగా చదవి స్పందిస్తే బాగుంటుందని, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే 80 శాతం హామీలను అమలు చేశామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవినీతి ప్రక్షాళన చేపట్టారని, ఇసుక, మట్టి దోపిడీలు ఎక్కడా జరగడం లేదని అన్నారు.