కాపులను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు: అంబటి రాంబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 02:47 PM
 

అమరావతి:  కాపులను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కాపులకు రూ.2వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. నిర్ణీత వ్యవధిలో కాపు రిజర్వేషన్లు పూర్తి చేస్తామని చెప్పిమోసం చేశారన్నారు. కాపులకు న్యాయం చేయనందుకు ముందుగా క్షమాపణ చెప్పి మాట్లాడాలన్నారు. తొలి ఏడాదిలోపే కాపుల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని, ఐదేళ్లలో కాపుల అభివృద్ధికి రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్‌ చెప్పలేదన్నారు. తుని రైలు ఘటనలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు.