కాపులకు 5శాతం బిల్లుపై ప్రభుత్వ వైఖరి తెలపాలి : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 02:45 PM
 

కాపులకు 5శాతం బిల్లుపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ…. కాపు రిజర్వేషన్లు అనేవి ఇవాళ్టి సమస్య కాదన్నారు. అనేక దఫాలుగా వారు పోరాడుతూనే ఉన్నారన్నారు.