భవనం కూలిన ఘటనలో 12మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 02:22 PM
 

ముంబయిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డోంగ్రి ప్రాంతంలోని తండెల్‌ వీధిలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. భవనం శిథిలాల కింద మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.