నేటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:12 PM
 

అసెంబ్లిలో ఇవాళ్టి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండన్స్‌ వేయాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లిలో టీడీపీపై చేస్తున్న దాడి సరిపోవడం లేదని, ఇంకా దూకుడు పెంచాలన్న ఉద్దేశంతో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు అసెంబ్లిలో చేస్తున్న దాడి సమయంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లిలో ఉండడం లేదని జగన్‌ భావిస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని చీఫ్‌ విప్‌కి జగన్‌ సూచించారు. ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులకు బాధ్యత అప్పగించినట్లు తెలిసింది.