సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం భూపేందర్

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:02 PM
 

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు స్థలం కేటాయింపు కేసులో ఇవాళ హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పంచకులలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కి పబ్లిషర్ గా ఉన్న అసోయేటెడ్ జర్నల్ కి 1982లో హర్యానా ప్రభుత్వం ల్యాండ్ కేటాయించింది. ఆ తర్వాత 1996లో ల్యాండ్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని ప్రభుత్వం ఆ ల్యాండ్ ను స్వాధీనం చేసుకొంది. అయితే ఆ తర్వాత హుడా 2005లో పంచకులలో తిరిగి అసోయేటెడ్ జర్నల్ కు ల్యాండ్ కేటాయించడం జరిగింది. అయితే అసోయేటెడ్ జర్నల్ కి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కింద హుడా ల్యాండ్ కేటాయించడంలో జరిగిన అవకతవకలపై 2016లో హర్యానా విజిలెన్స్ బ్యూరో మొదట విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది.