మ‌ళ్లీ శ్రీ‌వారి అర్చ‌నానంత‌ర ద‌ర్శ‌నం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:52 AM
 

త్వ‌ర‌లో అర్చ‌నానంత‌ర ద‌ర్శ‌నం ప్ర‌వేశ పెడ‌తామ‌ని టిటిటి చైర్మ‌న్ వైవి సుబ్బా రెడ్డి చెప్పారు.  మంగ‌ళ‌వారం ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాలో మాట్లాడుతూ, దేవుడు ముందు అంద‌రూ స‌మాన‌మేన‌ని, కానీ ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 పేర్ల‌తో ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల ఏర్పాటు వెనుక గ‌త పాల‌క మండ‌ళ్ల స్వార్ధం ఉంద‌ని ఆరోపించారు. అందుకే ఈ విధానం రద్దు చేస్తామ‌ని చెప్పారు సుబ్బారెడ్డి. త్వ‌ర‌లోనే పాల‌క మండ‌ళ్ల స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తుంద‌ని, తొలి స‌మావేశంలోనే అర్చ‌నానంత‌ర ద‌ర్శ‌నంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.  ఇప్ప‌టికే ఈ విష‌య‌మై సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారాయ‌న‌.