అచ్చెన్నాయుడి పై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:41 AM
 

ఎపి శాసన సభలోని బడ్జెట్‌ సమావేశం వాడివేడిగా జరిగింది. మంగళవారం సభ ప్రారంభమవగానే తమ తరపున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ను మాజి సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా త్వరగా ముగించాలంటూ.. తమ్మినేని సూచించారు. ' నేను సబ్జెక్టుకే వస్తున్నా.. లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తా ' అని అచ్చెన్నాయుడు అనడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ' మీరు చెప్పండి. నేనే చదువుతాను. ఏం మాట్లాడుతున్నారు.. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా ' అంటూ.. స్పీకర్‌ మండిపడ్డారు. ఇలా వ్యవహరిస్తే సభ నడపడం చాలా కష్టమవుతుందని సీతారాం వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు సభ సంప్రదాయాలు మర్చిపోయారని, స్పీకర్‌ ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని వైసిపి సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.