వైఎస్ ఆత్మ వెళ్లి కియోకి చెప్పిందా?

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:35 AM
 

కియో మోటార్స్ ఏపిలో వ‌చ్చిందంటే అది వైఎస్ ధ‌ర్మ‌మేనంటూ ఆర్ధిక మంత్రి బుగ్గాన చెపుతుండ‌టంపై తెలుగుదేశం పార్టీ స‌భానాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు త‌ప్పు ప‌ట్టారు. 2009లో చ‌నిపోయిన వైఎస్ ఆత్మ కియో మోటార్స్ వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏపి వెళితే చంద్ర‌బాబు అన్ని అనుమ‌తులు ఇస్తారు. వెళ్లి అక్క‌డ ఫ్యాక్ట‌రీ పెట్టండి అని చెప్పిందా? అని నిల‌దీసారు.  ఈ విష‌యంలో మంత్రికి క‌నీస అవ‌గాహ‌న లేద‌ని ఎద్దేవా చేసారు.


దీనిపై స్పందించిన మంత్రి బుగ్గ‌న 2007లో వైఎస్ ని క‌ల‌సిన  సంద‌ర్భంలో ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం కియో కంపెనీ సిఈఓ త‌న లేఖ‌లో పేర్కొన్న విష‌యాన్నిగ‌మ‌నించాల‌ని సూచించారు.