అచ్చెన్నాయుడుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:31 AM
 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఇవాళ సభ ప్రారంభమవగానే తమ తరఫున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను చంద్రబాబునాయుడు కోరారు.  ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా త్వరగా ముగించమని తమ్మినేని సూచించారు. ‘నేను  సబ్జెక్టుకే వస్తున్నా.. లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తా’ అని అచ్చెన్నాయుడు అనడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చెప్పండి. నేనే చదువుతాను… ఏం మాట్లాడుతున్నారు? ఇదేమైనా బజారు అనుకుంటున్నారా?’ అంటూ మండిపడ్డారు. ఇలా వ్యవహరిస్తే సభ నడపడం చాలా కష్టమవుతుందని వ్యాఖ్యానించారు.