ప‌రువున‌ష్టం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊర‌ట‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:19 AM
 

ప‌రువున‌ష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాల‌కు ఊర‌ట ల‌భించింది. ఢిల్లీలోని ప్ర‌త్యేక కోర్టు ఆ ఇద్ద‌రికీ బెయిల్ మంజూరీ చేసింది. బీజేపీ నేత విజింద‌ర్ గుప్తా ఈ కేసును దాఖ‌లు చేశారు. ఇద్ద‌రికీ చెరో ప‌దివేల రూపాయాల బాండ్‌పై బెయిల్‌ను ఇచ్చారు. జూలై 25వ తేదీన ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఇద్ద‌రు నేతలు న‌ష్ట‌ప‌రిహారం కింద కోటి రూపాయ‌లు ఇవ్వాలంటూ గుప్తా త‌న పిటిష‌న్‌లో డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో విజింద‌ర్ గుప్తాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేసేందుకు గుప్తా ప్ర‌య‌త్నించిన‌ట్లు కేజ్రీ ఆరోపించారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న బీజేపీ నేత‌.. కోర్టులో ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు చేశారు.