స‌దావ‌ర్తి భూముల‌పై విజిలెన్స్ ఎంక్వ‌యిరీ : మ‌ంత్రి వెల్లంప‌ల్లి

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:19 AM
 

స‌దావ‌ర్తి భూముల‌పై విజిలెన్స్ ఎంక్వ‌యిరీ చేసేందుకు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేసారు దేవాదాయ మంత్రి వెల్లంప‌ల్లి. మంగ‌ళ‌వారం స‌దావ‌ర్తి భూముల‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో వైసిపి స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి స‌దావ‌ర్తి భూముల విష‌యంలో త‌ను పూర్తిగా పోరాడాన‌ని, చివ‌రికి సుప్రీం కోర్టు కు కూడా వెళ్లిన‌ట్టు చెపుతూ, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 5వేల కోట్లు రూపాయ‌ల విలువ చేసే భూమి కొట్టేయాల‌ని గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు చూసార‌ని, త‌క్కువ రేటుకు అమ్మేయ‌త్నం చేసార‌ని ఆరోపించారు. ఈ విష‌య‌మై సంపూర్తిగా విచార‌ణ డిమాండ్ చేసిన విష‌య‌మై మంత్రి స్పందించి విచార‌ణ చేస్తామ‌ని చెప్పారు.