ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వ‌ని మీరు మాకు చెప్తారా?

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:08 AM
 

నాడు ఎన్టీఆర్‌ నుంచి పదవి లాక్కుని ఆయనకు సైతం చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.  మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రికీ తెలుస‌ని,  భారతదేశ చరిత్రలో ఏ అసెంబ్లీ జరగని విధంగా గ‌త ఐదేళ్లు నిరంకుశంగా  ఏపీ శాసనసభ నడిచిన విష‌యం తెలుగుదేశం నేత‌ల‌కు తెలియ‌దా అని నిల‌దీసారు. దీంతో తెలుగుదేశం స‌భ్యులు లేచి త‌మ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసారు. గ‌త పాల‌న గురించి మాత్ర‌మే త‌మ స‌భ్యుడు మాట్లాడాడ‌ని, ఇందుకు అభ్యంత‌రం ఎందుక‌ని ఆర్ధిక మంత్రి బుగ్గ‌న టిడిపి స‌భ్యుల‌ను ఎద్దేవా చేసారు.