గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:55 AM
 

పెద్దపల్లి జిల్లా గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో నీటి నిల్వ పెరుగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 6.8 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నీటి ప్రవాహం 12వేల క్యూసెక్కులుగా ఉంది. కన్నెపల్లి పంపుహౌజ్‌ నుండి ఐదు మోటార్ల ద్వారా 11,500 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. అన్నారం బ్యారేజ్‌లో 4.47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజ్‌ నీటి నిల్వతో బ్యాక్‌ వాటర్‌  పెరుగుతోంది. అన్నారం పంప్‌హౌజ్‌ నుంచి వాటర్‌ లిఫ్ట్‌ చేయడానికి అధికారులు మోటార్లు సిద్ధం చేశారు.