స‌భ‌ని గంద‌ర‌గోళంలో ప‌డేసిన నీ...... య‌మ్మ‌......

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:42 AM
 

శాస‌న‌స‌భ‌లో మంత్రి పేర్ని నేని, టిడిపి స‌భ్యుడు అచ్చెన్నాయుడు పై చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీలో దుమారం రేపాయి. ప్ర‌శ్నోత్త‌రాల‌కు ముందు మంత్రి మాట్లాడుతూ అచ్చెన్నాయుడుని ఎన్నుకున్నందుకు టెక్క‌లి ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారంటూ నీ... య‌మ్మ అనే ప‌దం వాడ‌టం ప‌ట్ల టిడిపి స‌భ్యుల నుంచి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. మంత్రి వాడుతున్న ప‌దాలు త‌మ ప్రాంత ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌ర‌చేలా ఉన్నాయ‌ని అచ్చెన్నాయుడు భ‌గ్గుమ‌న్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని వివ‌ర‌ణ ఇస్తూ తను ఎవ‌రిని కించ‌ప‌ర‌చ‌లేద‌ని, స‌ర్వ‌సాధార‌ణంగా ఉన్న ప‌ద‌మే వాడాన‌ని, దీనివ‌ల్ల ఎవ‌రైనా బాధ ప‌డితే ఉప‌సంహ‌రించుకునేందుకు సిద్ద‌మేన‌ని, స్పీక‌ర్ రికార్డులు ప‌రిశీలించుకోవాల‌ని కోరారు. బ్రేక్‌లో ఈ విష‌యం ప‌రిశీలిస్తాన‌ని చెప్ప‌డంతో స‌మ‌స్యకు తాత్కాలికంగా విరామం దొరికిన‌ట్టే