ఆరోపణలకే సమయం వృథా చేస్తున్న వైసీపీ : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:38 AM
 

తెలుగుదేశంపై ఆరోపణలకే సభా సమయాన్ని వైసీపీ వృథా చేస్తుందని తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక టీడీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఐదేళ్లలోనే 66 శాతం పోలవరం పనులను తెలుగుదేశం పూర్తి చేసిందన్నారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తీసుకురాలేకే వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. ఆగిపోయిన పనులు ప్రారంభించడం వైకాపాకు చేతకాదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పనులు పడకేశాయన్నారు. పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం అభాసుపాలైందన్నారు.