ఏపీఐఐసీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:19 AM
 

నగరి ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ కార్యాలయంలో ఆమె తొలిసారి అడుగుపెట్టారు. రిబ్బన్ కట్ చేసి.. భర్త సెల్వమణితో కలిసి ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన రోజా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అధికారులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. 


పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు రోజా. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు వచ్చేవి అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని.. పరిశ్రమలకు భూములు కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు రోజా. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని ప్రకటించి దాదాపు నెలకు పైగా గడుస్తోంది. కానీ అధికారికంగా ఉత్తర్వులు మాత్రం రాలేదు. కొన్ని కారణాలతో.. ఉత్తర్వులు రావడం ఆలస్యమయ్యిందట. అందుకే రోజా కూడా బాధ్యతలు స్వీకరించలేదట. తాజాగా రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రోజా బాధ్యతలు స్వీకరించారు. 


సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణాలతో రోజాకు పదవి దక్కలేదు. దీంతో ఆమె కొంత అసంతృప్తికి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం రోజాను బుజ్జగించింది. ఆ వెంటనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి దక్కింది.
నేటి పంచాంగం నేటి పంచాంగం

Wed, Feb 26, 2020, 03:27 PM