నాటా మ‌హా స‌భ‌ల‌కు రండి = జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ఆహ్వానం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:42 AM
 

వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో జరిగే నాటా మహాసభలకు హాజ‌రు కావాలంటూ అసెంబ్లీలోని కార్యాలయంలో ముఖ్యమంత్రిని నాటా సభ్యులు ఆహ్వానించారు. సోమ‌వారం జ‌గ‌న్‌ని క‌ల‌సుకున్న  నాటా బృంద సభ్యులు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు.


సీఎంను కలిసినవారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ మేకా శివ, ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ కిష్టపాటి రమణారెడ్డి, నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సాగంరెడ్డి అంజిరెడ్డి, ఇండియా కో–ఆర్డినేటర్‌ మల్లుప్రసాదరెడ్డి ఉన్నారు.