ఎలుగుబంటి దాడిలో గాయ‌ప‌డిన మ‌హిళకు టిటిడి ఛైర్మ‌న్ ప‌రామ‌ర్శ‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:28 AM
 

తిరుమలలోని ఆకాశ‌గంగ అట‌వీ ప్రాంతంలో సోమ‌వారం ఎలుగుబంటి దాడిలో గాయ‌ప‌డి అశ్విని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విజ‌య‌ల‌క్ష్మిని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చ‌ర‌వాణిలో ప‌రామ‌ర్శించారు.


గాయ‌ప‌డిన మ‌హిళ‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అశ్విని వైద్యాధికారుల‌ను ఛైర్మ‌న్ ఆదేశించారు. మ‌హిళ‌లు ఒంట‌రిగా అట‌వీ ప్రాంతంలోకి వెళ్ల‌రాద‌ని సూచించారు. ఈ విష‌య‌మై అధికారులు కూడా భ‌క్తుల‌కు త‌గిన సూచ‌న‌లు చేయాల‌ని కోరారు.టిటిడి తిమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం అశ్విని ఆసుప‌త్రికి చేరుకుని గాయ‌ప‌డిన మ‌హిళ‌ను ప‌రామ‌ర్శించారు. మ‌హిళ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అవ‌స‌ర‌మైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను ఆదేశించారు.