బిగ్ బాస్‌లో ఉండేది వీళ్లేన‌ట‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:16 AM
 

బిగ్ బాస్ – 3 పై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ప్రేక్షకులు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. ఇందులో కంటెస్టెంట్లు ఎవరంటూ ఆరా తీస్తున్నారు. అక్కడా ఇక్కడా తెలిసిన పేర్లను సేకరించిన కొందరు అభిమానులు బిగ్ బాస్ మూడో సీజన్ లో అడుగుపెట్టేది వీరేనంటూ సోషల్ మీడియాలోకి వదిలారు. ఇలా బయటకు వచ్చిన పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే షో నిర్వాహకులు, స్టార్ మా ఛానెల్ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 100 రోజులపాటు ఈ షోను నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వారి పేర్లు ఇవే...


 


1. నటుడు వరుణ్ సందేశ్ 


2. యాంకర్ శ్రీముఖి


3. నటి హిమజ 


4. నటి హేమ 


5. నటుడు తరుణ్


6. గాయకుడు హేమచంద్ర 


7. యాంకర్ ఉదయభాను


8. శ్రీరెడ్డి 


9. వైవా హర్ష 


10. ‘తీన్‌మార్’ సావిత్రి (యాంకర్ శివ జ్యోతి) 


11. యాంకర్ లాస్య 


12. మహాతల్లి ఫేమ్ జాహ్నవి 


13. జర్నలిస్ట్ జాఫర్ 


14. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 


15. రఘు మాస్టర్


కానీ.. యాంకర్ శ్రీముఖి, ‘తీన్‌మార్’ సావిత్రి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఖరారయ్యారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కచ్చితంగా చెపుతున్నారు. అయితే, ‘బిగ్ బాస్’లో చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఇప్పటికే యాంకర్ లాస్య, ఉదయభాను, తరుణ్ ఖండించారు. తాము ఈ షోలో చేయడం లేదని చెప్పారు. తాను ‘బిగ్ బాస్’లో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శ్రీరెడ్డి పేరు జాబితాలో ఉన్నా ఆమెను తీసుకునే ధైర్యం ‘బిగ్ బాస్’ నిర్వాహకులకు లేదని అంటున్నారు.