నిరుద్యోగ యువ‌త‌కు అండ‌గా నిలుస్తా : రోజా

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:13 AM
 

 నవరత్నాలకు బడ్జెట్ లో కేటాయింపులు   చూసిన తరువాత సీఎం వైఎస్. జగన్ మహిళ పక్షపాతి అని మ‌రోమారు ప్ర‌జ‌ల‌కు  అర్ధమైంద‌ని  ఏపీఐఐసీ  అధ్య‌క్షురాలు ఆర్ కే. రోజా అన్నారు.  పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంత‌రం సోమ‌వారం త‌న కార్యాల‌యంలో మీడియాతో మాట్ల‌డుతూ  రాష్టంలో  పెట్టుబడులు పెట్టె వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తా, పారిశ్రామిక అభివృద్ధి కి కృషి చేస్తాను అన్నారు. కేంద్రం హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని వైసిపి ఎంపిలు దీనిపై నిరంత‌రం పోరాడుతునే ఉంటార‌ని అన్నారు.   ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికరణకు బడ్జెట్లో సీఎం పెద్ద పీట వేయ‌టాన్ని అంద‌రూ గ‌మ‌నించాల‌ని అన్నారు. పారదర్శకంగా ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయింపు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అన్ని జిల్లాలో పారిశ్రామిక రంగానికి కృషి చేస్తాము. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75 శాతం ఇస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేస్తూ, త‌మ‌సంస్ధ‌ద్వారా ఈ విషయంపై అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పారు రోజా.