విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో బాబు మోసం : కాకాని

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:07 AM
 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి  విమర్శించారు. చంద్రబాబు  విదేశీ పర్యటనల ఖర్చు లతో ప్రజలపై భారం పడిందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 39 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టారని తెలిపారు. ఏపీకి  ఐటీ సంస్థలు వస్తున్నాయని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారని  ఆయన అనుభవముతో రాష్ట్రానికి  ఒరిగిందేమీ లేదని అన్నారు.