జ‌గ‌న్‌కి షాక్‌.... తోట కుటుంబం బిజెపి చెంత‌కు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:04 AM
 

నిజ‌మే.... తోట కుటుంబం క‌మ‌లం పార్టీలో చేరేందుకు సిద్ద‌మువుతున్న‌ట్టు వ‌స్తున్న క‌థ‌నాలు వాస్త‌వమే అనిపిస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసిపిలో చేరిన తోట కుటుంబ స‌భ్యులు త‌మ తోట వాణికి టిక్కెట్ ఇప్పించుకుని చిన్న రాజ‌ప్ప‌పై పోటీకి నిల‌చి స్వ‌ల్ప ఆధిక్య‌త‌తో ఓడిపోయారు. అది మొద‌లు రాజ‌ప్ప ఎన్నిక‌ల చెల్ల‌దంటూ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసినా, గ‌త కొంత కాలంగా  వైసిపి కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నీ కుటుంబం హ‌ఠాత్తుగా క‌మలం పార్టీలో చేరిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం.  బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ నేత‌గా పేరున్న వాణి  బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం వైసీపీకి షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఇప్ప‌టికే టిడిపి వీడి బిజెపిలో చేరిన  ఎంపీ సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో వాణి మంతనాలు జరిపినట్లు సమాచారం అందుతోంది.  ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్‌గా దవులూరి దొరబాబుకు బాధ్యతలు అప్పగించడంతో వాణి త‌న ప‌రివారంతో బిజెపిలో చేర‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని  వైసిపి వ‌ర్గాలు చెపుతుండ‌టం విశేషం.