ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన రోజా

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 05:32 PM
 

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. ఏపీ కేబినెట్ లో చోటు లభిస్తుందని రోజా భావించారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా భారీ ఎత్తున జరిగింది. అయితే పలు సమీకరణాల నేపథ్యంలో, ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో, ఆమె ఎంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, ఆమెను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.