మీకు మెజారిటీ లేదు- అందుకే అవిశ్వాసం

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 05:02 PM
 

తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని క‌ర్నాట‌క సిఎం కుమారస్వామి శాసనసభలో ప్రకటించిన  నేప‌ధ్యంలో గురువారం విశ్వాస ప‌రీక్ష చేప‌ట్టాల‌ని స్పీక‌ర్ నిర్ణ‌యించారు. అయితే 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో శాసనసభలో  జెడిఎస్‌- కాంగ్రెస్ సంకీర్ణానికి సంఖ్యాబలం తగ్గిందని స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా ఇంకా విశ్వాస పీర‌క్ష‌లెందుక‌ని నిల‌దీస్తున్న భారతీయ జనతా పార్టీ..  సోమ‌వారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామిపై, ఆత‌ని ప్ర‌భుత్వంపైనా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది.  అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు స్పీక‌ర్‌కు అంద‌జేస్తూ, రేప‌టి నుంచి దీనిపై చ‌ర్చ జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరింది. ఇప్ప‌టికే   జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశాలు మృగ్య‌మైపోతున్న త‌రుణంలో   విశ్వాస పరీక్ష ఎదుర్కొన‌టం ప్రాణ‌సంక‌ట‌మే. ఈ నేపథ్యంలో అటు సంకీర్ణ కూటమి, ఇటు భాజపా తమ తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించి, వారిని కాపాడుకునే ప‌నిలో ప‌డ్డారు.