టిటిడి క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాల‌కు మేనేజిమెంట్ కోటా పూర్తి

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 04:38 PM
 

తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల మరియు శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలలో 2019-20 విద్యా సంవత్సరములో మేనేజిమెంట్ కోటా క్రింద ప్రవేశముల కొరకు అందిన ద‌ర‌ఖాస్తులు/విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేయడము పూర్తి అయినట్లు టిటిడి ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు టి.టి.డి ప్రజాసంబంధాల అధికారి ఓ ప్ర‌క‌ట‌న‌ల‌ విడుదల  చేస్తూ, ఎంపిక చేయబడ్డ విద్యార్థినీ విద్యార్థులకు వారి చరవాణికి సదరు సమాచారమును  15-07-2019 సాయంత్రములోగా పంపించడము జరుగుతుందన్నారు. సమాచారము అందుకున్న విద్యార్థినీ విద్యార్థులు   16-07-2019 నుండి 20-07-2019 లోగా వారి ఒరిజనల్ టి.సి., మరియు మార్కుల జాబితా, కులము, ఆదాయము మొద‌లైన‌ ధృవీకరణ పత్రములతో వారికి సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంద‌ని. 20-07-2019 సాయంత్రము లోగా రిపోర్టు చేయనట్లయితే వారికి కేటాయించిన సీటు రద్దు అవుతుంద‌ని తెలిపారు. 


కళాశాలలలో ఇంకా మిగిలివున్న సీట్లను తేదీ 22-07-2019 ఉదయము నుండి స్పాట్ అడ్మిషన్ పద్దతిన స్థానికులయిన విద్యార్థినీ విద్యార్థులతో నింపడము జరుగుతుందని వివ‌రించారు.