చంద్ర‌యాన్‌- 2 వాయిదా ఎందుకంటే

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 04:16 PM
 

భార‌త్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రుడిపైకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యి, ప్ర‌యోగ‌మే త‌రువాయ‌న్న‌ద‌శంలో  చంద్రయాన్-2  నిలిచిపోయింది.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం వాహక నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడమేన‌ని, అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయంలో టి-56 నిమిషంలో  ప్రయోగంను నిలిపివేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. దీంతో సోమవారం జరగాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. త్వరలోనే చంద్రయాన్ -2 చంద్రుడిపైకి పంపే తేదీని ఇస్రో ప్రకటిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.