క్షీణిస్తున్న ఎల్‌నినో వ‌ర్షాలు పంపేనా?

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 04:10 PM
 

 పసిఫిక్‌ మహా సముద్రంలో అంతర్గతంగా ఏర్పడే ఉష్ణ ప్రవాహాల ప్రక్రియ ఎల్‌నినో   నైరుతి రుతుపవనాల విస్తరణకు అడ్డుగా నిలుస్తుస్తోంద‌న్న విషయం విదిత‌మే. దీని కార‌ణంగా  వర్షాలు రావ‌టంలో ఆల‌స్య‌మ‌వుతోంది.  రైతాంగం ఎదురు చూపులు చూసే జూన్‌లో  లోటు వర్షపాతం త‌క్కువ‌వ‌టంతో   భారత్‌లో పరిస్థితులు అస్తవ్యస్తం గా మారిపోతున్నారు. .ఈ ఏడాదీ ఎల్‌నినో ప్రభావంతో  జూన్‌లో సాధారణం కన్నా 33% లోటు వర్షపాతం త‌క్కువ గా ఉంది. దీంతో దేశంలో అత్యధిక ప్రాంతాలలో  భూగర్భ జలాలు అడుగంటి  కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. తాజాగా  ఎల్‌నినో క్ర‌మ‌ క్రమంగా బలహీన పడుతున్నందున‌ మున్ముందు మంచి వర్షా లు కురుస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు తీపి క‌బురందించారు. ఇది మనకు శుభవార్తే. జూన్‌లో వెక్కిరించిన రుతుపవనాలు జూలైలో మాత్రం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు సాధారణం కన్నా 22 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో గత నెలలో 33 శాతంగా ఉన్న లోటు ఈ నెలాఖరుకు 12 శాతానికి తగ్గే అవకాశాలున్నాయి. 


అయితే ఎల్‌నినో క్షీణించినా ఈసారి భారత్‌లో మంచి వర్షాలు పడుతాయని కచ్చితంగా చెప్పలేమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితుల వల్ల వర్షపాతం ఆశించిన మేర ఉండకపోవచ్చంటున్నారు.