క‌మ‌లం వైపు కేశినేని అడుగులు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 03:31 PM
 

పార్టీ నేత‌ల‌పైనే ట్వీట్ల యుద్దాన్ని చేస్తున్న విజ‌య‌వాడ ఎంపి కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.  తాజాగా కేశినేని నాని చంద్రబాబునాయుడును టార్గెట్ గా చేసుకుని  , తనను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేశినేని నాని ట్వీట్ చేశారు. ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానన్నారు. తనలాంటి వాళ్లు పార్టీలో ఉండాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోవాలని కేశినేని నాని ట్వీట్ చేయడం చూస్తుంటే ఆయ‌న‌ పార్టీ నుంచి వైదొలగడానికి ఇస్తున్న‌ సంకేతాలని పార్టీ వ‌ర్గాల‌లోనే వినిపిస్తోంది.   జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే కేశినేని నాని పార్టీని వీడి, క‌మ‌లం చెంత‌కు చేరే సమయం ఎంతో దూరం లేదనిపిస్తోందన్న‌ది వారు చేపుతున్న మాట‌.