బిజెపిలో చేరిన లోకేష్‌ స‌న్నిహితుడు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 01:36 AM
 

తెలుగు దేశం  పార్టీకి మరొక సీనియర్ నాయకుడు  చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చే చేసి బిజెపిలో చేరిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయ‌న అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాలనుండి ఉన్నత చదువు పూర్తి చేశారు. తర్వాత ISRO / NASA, అమెరికన్ గవర్నమెంట్ లో అంతరిక్ష శాస్త్రవేత్త గా పని చేశారు.  


రాజ‌కీయాలపై ఉత్సాహంతో    చంద్రబాబు ని క‌ల‌సి ఆయ‌న‌ సలహా మేరకు ఆమెరికా ఉన్నతోద్యోగం వదలి పార్టీలో చేరారు.  2004 లో దుగ్గిరాల నుండి మొదటిసారి శాసనసభకు పోటీచేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి జి. వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు.  పార్టీ అధికార ప్రతినిధిగా , ఆర్గనైజింగ్ సెక్రెటరీగా విశేషంగా కృషి చేశారు. బలమైన కాపు సామాజకవర్గం ప్రతినిధిగా పార్టీలో ఉన్న ఆయన  పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌కి అత్యంత స‌న్నిహితుడుగా పేరుతెచ్చుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగాపార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు, నేత‌ల తీరు న‌చ్చ‌ని ఆయ‌న పార్టీకి రాజీనామా చేసి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను చూసుకోవాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకులు శివరాజ్‌ చౌహాన్‌ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.