అలాంటివి ఇక్క‌డ కుద‌ర‌వ్‌- కొత్త నేత‌ల‌కు రాంమాథ‌వ్ ఉద్భోద‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 01:04 AM
 

బీజేపీలో రాజకీయం భిన్నమని, కుల రాజకీయాలు, గ్రూపుల రాజకీయాలుండవని, ఫోటోల రాజకీయం అంతకంటే ఉండవ‌నితెలుసుకుని మ‌సులు  కోవాల‌ని తేల్చి చెప్పారు బిజెపి నేత రామ్‌మాధవ్. ఆదివారం ఆయ‌న గుంటూరులో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి  ప్రసంగిస్తూ.  బీజేపీ విధానాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక పార్టీల నుంచి కొత్తవారు బీజేపీలో చేరుతున్నారని అయితే వారికి బిజెపి విధి విధాన‌లు తెలియకపోతే సీనియర్లు    చెప్పాల్సిందేనని  అన్నారు.  దేశహితం కోసం సమర్పణా భావంతో ప్రజల మధ్య, ప్రజల కోసం పనిచేసే సంస్కృతి బీజేపీదని  దీనిని పార్టీలో చేరుతున్న కొత్త నాయకులు ఆక‌ళింపు చేసుకుని పనిచేయా ల్సి ఉంటుంద‌ని, ఇత‌ర పార్టీల‌లోగా ఇక్క‌డ వ్య‌వ‌హారాలుండ‌వ‌ని తెలుసుకోవాల‌ని సూచించారు.