ఎట్టకేలకు తొలిసారి వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ జట్టు సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ రెండు పర్యాయాలు డ్రా అయినప్పటికీ ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం అనే నిబంధన ప్రకారం ఈ వరల్డ్ కప్ ఇంగ్లండ్ జట్టునే వరించడం విశేషం. వివరాలలోకి వెళితే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ షాట్ కొట్టి, రెండు పరుగులతో విజయం అందించేందుకు యత్నించాడు. కానీ రెండో పరుగు తీసే సమయానికి మార్క్ వుడ్ రనౌట్ కావటంతో డ్రా కావాల్సి వచ్చింది. దీంతో నిర్వాహకులు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ 15 పరుగులు చేయగా. 16 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు సూపర్ ఓవర్ ముగిసే సమయానికి 15 పరుగులు మాత్రమే చేయటంతో అనూహ్యంగా మరోమారు మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఫలితం ఏమిటన్న మీమాంశ నెలకొన్న సమయంలో సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ జట్టు సిక్స్ కొట్టినప్పటికీ ఇంగ్లండ్ జట్టు రెండు ఫోర్లు కొట్టడంతో విజయం ఇంగ్లాండ్ జట్టునివరించినట్టు ప్రకటించారు.