అంగ‌రంగ వైభ‌వంగా శాకాంబ‌రి ఉత్స‌వాల ఆరంభం

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 12:04 AM
 

 ఆదివారం నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న క‌న‌క‌దుర్గ ఆల‌యంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమ‌య్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు.ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. .ప్రతి ఏటా ఆషాఢమాసం లో ఇంద్రకీలాద్రి పై మూడు రోజులపాటు శాకాంబరీ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వ‌స్తున్న ఈ . ఉత్సవాల్లో  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ స‌భ్యుల తో క‌లిసి పాల్గొన్నారు. అనంత‌రం అమ్మవారిని దర్శించుకున్నారు. అంత‌కుముందు అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ మీడియాలో మాట్లాడుతూ  ,అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్న‌ట్టు చెప్పారు.