150 ఏళ్ల త‌రువాత గురుపౌర్ణ‌మి నాడు చంద్ర‌గ్ర‌హ‌ణం

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 11:58 PM
 

 ప్రతి ఏడాది హిందువులు ఆషాడ పౌర్ణమిని వేద వ్యాసుని జయంతిని, గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ నెల 16న గురు పౌర్ణిమ రానుంది. ఈ పౌర్ణ‌మిని అట్ట‌హాసంగా జ‌రిపేందుకు అటు షిర్డీ సాయి భ‌క్తులు కూడా ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేసారు. ఇప్ప‌టికే సాయిబాబా ఆల‌యాలు పున్నమి కోసం ముస్తాబ‌య్యాయి. 


అయితే ఈ మున్న‌ ఎనిమిది గంటల తేడాతో చంద్ర గ్రహణం జరగబోతుండ‌టం విశేషం. ఇలాంటి సందర్బాలు  అరుదుగా వ‌స్తాయి.  చంద్ర గ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడే జరుగుతుంది.ఇంతకు ముందు జులై 12, 1870న ఒకే సమయంలో చంద్ర గ్రహణం, గురుపౌర్ణిమ వచ్చాయి.మళ్లీ ఇప్పుడు దాదాపు 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం రాబోతోంద‌ని పండితులు తెలిపారు.  తదుపరి  ఇలాంటి చంద్ర గ్రహణం చూడాలంటే మే 26, 2021 న మ‌రోమారు వ‌స్తుంద‌ని చెపుతున్నారు.