300 కోట్లు నాకేసిన మీకు 500 కోట్లు త‌క్కువే

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 11:50 PM
 

రాజ‌ధాని అమ‌రావతి నిర్మాణానికి కేవ‌లం 500 కోట్లు మాత్ర‌మే బ‌డ్జెట్‌లో కేటాయించ‌డంపై మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంపై పై వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబుకు బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమేన‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారని మండిప‌డ్డారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశార‌ని, విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి..? అని విజ‌య సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.