ఇక యూపి బాధ్య‌త‌లు ప్రియాంక‌కే

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 11:41 PM
 

ఉత్తరప్రదేశ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 80 స్థానాలకు గాను కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుని పూర్తిగా చతికిలపడిన  కాంగ్రెస్ ని భారీగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టే క‌నిపిస్తోంది.  ఇప్ప‌టికే ఎన్నిక‌లలో పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ సైతం ఓట‌మి చెంద‌టానికి కార‌ణాలు వెతుక్కుంటున్న కాంగ్రెస్ నేత‌లు  ప్రక్షాళన కార్యక్రమం కొనసాఇస్తున్నారు. అన్ని జిల్లాల‌ల క‌మిటీల‌ను రద్దు చేసిన అధిష్టానం లోక్‌సభ ఎన్నికలకు ముందు కేవలం తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన  ప్రియాంక గాంధీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఇన్‌చార్జి పగ్గాలు అప్పగించినట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం.   పార్టీని పునరుద్ధరించాలంటే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న   12 అసెంబ్లీ స్థానాలలో క‌నీసం స‌గ‌మైనా విజ‌యం సాధించాల‌న్న పట్టుదల  కాంగ్రెస్ నేత‌ల‌లో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నికల సన్నాహకాలను పర్యవేక్షిచేందుకు ఇద్దరు సభ్యుల బృందాన్ని కూడా నియమించారు. ప్రియాంక త్వ‌ర‌లో బాధ్య‌త‌లు చేప‌ట్టిప్ర‌చార బ‌రిలోకి దిగుతార‌ని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి.