టిడిపి ఫైర్ బ్రాండ్ చింత‌మ‌నేనికి క‌మ‌లం తీర్ధం?

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 11:32 PM
 

చాలా కాలంగా పార్టీ దూరంగా ఉంటూ వ‌స్తున్నమాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న చింత‌మ‌నేని ప్రభాక‌ర్  త్వ‌ర‌లో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ బీజేపీ తీర్థం తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ‌ వ‌ర్గాలు అంటున్నాయి.  ఇటీవ‌లే టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాలు కూడా ఆయ‌న  హాజ‌రుకాక పోవ‌టంతో పాటు త‌న తో పాటుగా కొంద‌రిని బిజెపిలో చేర్పించేలా వ్యూహం ర‌చించిన‌ట్టు స‌మాచారం. ఈవిష‌య‌మై ఆయ‌న ఈ రోజు విజ‌య‌వాడ వ‌చ్చిన మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత సుజ‌నా చౌద‌రితో ఫోన్ మంత‌నాలు జ‌రిపిన‌ట్టు విన‌వ‌స్తోంది. దీనికి తోడు ఆ ఇప్ప‌టికే ఒక కేసుకు శిక్ష కూడా ఖ‌రారు కావ‌టం,  ఇక మిగిలిన కేసుల‌ను క‌దిలిస్తే ఆయ‌న ఖ‌చ్చితంగా క‌ట‌క‌టాల్లో వెళ్లె అవకాశాలు లేక‌పోలేద‌ని, అందుకే క‌మ‌లం చెంత‌కు చేరాల‌ని ఆయ‌న భావించిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి,   అయితే ఈ విష‌య‌మై చింత‌మ‌నేని వ‌ర్గం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ త‌గిన స్పంద‌న రాలేదు.