శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో వైభ‌వంగా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 10:53 PM
 

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ వైభ‌వంగా జరిగింది. ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఉదయం హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.