గతంలో బ్రేక్ దర్శనాల పేరుతో తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 04:29 PM
 

తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్వాగతించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, గతంలో బ్రేక్ దర్శనాల పేరుతో తిరుమల పుణ్యక్షేత్రంలో వ్యాపారం చేశారని మండిపడ్డారు. బ్రేక్ దర్శనాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని రోజా పేర్కొన్నారు. చాలా కొద్దిమందికి మాత్రమే బ్రేక్ దర్శనం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక, బడ్జెట్ పైనా రోజా స్పందించారు. ఏపీ వార్షిక బడ్జెట్ లో రైతులకు, వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారని కితాబిచ్చారు. రుణమాఫీ, వడ్డీలేని రుణాలు ఇవ్వడం సంతోషదాయకమని ఆమె వ్యాఖ్యానించారు.