చోడవరం బీఎన్ రోడ్డులో యువకుడి దారుణ హత్య

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 04:04 PM
 

 


విశాఖ జిల్లా చోడవరంలోని బీఎన్ రోడ్డులో కోన రాజేష్ అనే యువకుడిని దారుణంగా హత్యచేశారు. గుర్తుతెలియని వ్యక్తులు రాజేష్ ను కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. హత్య అనంతరం దుండగులు పరారవగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హత్యకు పాత కక్షలే కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.