మంత్రి పదవికి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 03:51 PM
 

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సిద్ధూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. జూన్‌ 10వ తేదీన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాజీనామా లేఖ పంపినట్లు ట్విటర్‌లో వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌, సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. జూన్‌ 6న మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టి సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖల్లో ముఖ్యమైన స్థానిక సంస్థలు, పర్యాటక, సాంస్కృతిక శాఖను తొలగించి విద్యుత్తు, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల శాఖలను అప్పగించారు. దీంతో రాజీనామా చేసినట్లు తెలిపారు.