ఐటి మంత్రితో ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్సిస్టిమెంట్ ప్రతినిధుల భేటీ

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 01:05 AM
 

వైజాగ్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్సిస్టిమెంట్ కు సంబంధించిన ప్రతినిధులు బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీస్ మరియు ఇన్నోవేషన్ క్రింద అకాడమి, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు స్థలమును కేటాయించవలసినదిగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కోరారు ఆ సంస్ధ ప్ర‌తినిధులు  మంగ‌ళ‌వారం స‌ద‌రు సంస్ధ ప్ర‌తినిధి బృందం మంత్రిని క‌ల‌సి  నిరుద్యోగులకు ఉద్యోగాలు, మార్కెటింగ్ వసతుల కల్పన చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని అన్నారు.  


 మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్విస్టిమెంట్ వారు వైజాగ్ లో అకాడమి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా వసతులు కల్పిస్తామని, యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి అనూప్ సింగ్, టెక్ స్టార్ ప్రెసిడెంట్ బాల గిరీష్ బల్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇన్విస్టిమెంట్ ప్రతినిధులు జెన్నీఫర్ ఎం జాన్సన్, టిఫెనీ టీ హాంగ్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.