విశాఖ‌ను ఐటి హ‌బ్ చేస్తాం : మ‌ంత్రి మేక‌పాటి

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 01:01 AM
 

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖా మాత్యుల  మేకపాటి గౌతమ్ రెడ్డి మంగ‌ళ‌వారం వైజాగ్ లోని టెక్ మహేంద్ర భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో టెక్ స్టార్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.   


ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విశాఖ‌కు ఐటి రంగంలో ఎన‌లేని ప్రాధాన్య‌త ఇస్త‌మ‌ని, దీనిని ఐటి హ‌బ్‌గా మార్చేందుకు అన్నివిధాలా స‌హ‌కరిస్తామ‌ని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ అమరావతి వద్ద పెద్ద పారిశ్రామికదారులను ఆహ్వనించి పరిశ్రమలను స్థాపన, సెమీ అర్బన్ ఏరియాలు అయిన మంగళగిరి, రాజమండ్రి, తిరుపతి లలో బీపీఓ కాల్ సెంటర్లు ఏర్పాటు   గురించి చర్చించారు.  పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి త్వరలో పరిశ్రమలు స్థాపిస్తామని తెలిపారు.